Sunday, October 15, 2006

నిజమైన ఆనందం [కధ]

ఇంట్లో అందరూ చాలా ఆనందం గా వున్నారు నేను తప్ప.నా పెళ్ళికి వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు.ఇక నేను కుడా వెళ్ళే సమయం వచ్చింది.నాకు చాలా భయం గా వుంది.సరిగా చెప్పాలంటే అది భయమో,బాధో నాకే తెలియడం లేదు. ఆయనని మొదట పెళ్ళి చూపులలో చూసినప్పుడు బానే అనిపించారు.తరువాత ఇద్దరూ మట్లాడుకోవడం మొదలు పెట్టాకా కొద్ది కొద్దిగా అర్దమయింది అతని ఆలొచనలు వేరు,నా అభిప్రాయాలు వేరు. కొంచెం కూడా భావుకత లేదు.అభిరుచులే కలవనప్పుడు జీవితాంతం కలసి జీవించడం కష్టం అనుకున్నాను. ఆ మాటే ఆయనతో చెపుదామనుకున్నాను.కాని గొంతు పెగలలేదు.నేనూ అతి మామూలు ఆడపిల్లనే కదా.నేను పెరిగిన వాతావరణ పరిధులనుండి ఆలోచనలయితే దాటించగలిగాను కానీ ఆచరణలో అమ్మా నాన్నల నమ్మకాన్ని దాటలేకపోయాను.అలా మా పెళ్ళి జరిగిపోయింది.ఆయనతో కొత్త ఇంట్లో కొత్త కాపురం.నన్ను బాగానే చూసుకుంటున్నారు.అయినా ఎదో అసంత్రుప్తి.ఆయన్ని చూస్తే పిసినారి ఏమో అనిపిస్తుంది.కాని అలా అనడానికి కూడా లేదు.ఎందుకంటే నా విషయం లో ఎప్పుడూ తక్కువ చేయలేదు.అడిగిన వన్ని ఇస్తారు.తన విషయం లో మాత్రం చాల పొదుపు పాటిస్తారు.ఆయన్ని అర్దం చేసుకోలేకపోతున్నాను.ఖరీదై న బట్టలు కొనుక్కోరు.బైకు వున్నా రోజు బుస్ లోనె వెళతారు.[నన్ను మాత్రం బైకు మీదే తీసుకెలతారు]బయట భోజనానికి వెలితే నేనేమి తిన్నా తను రోటీ మాత్రం తింటారు.ఇలా తన విషయం లో ఎందుకలా పిసినారిలా ప్రవర్తిస్తున్నారో అర్దమయేది కాదు.అడిగితే నాకు ఇలా వుండడమే ఇష్టం అనేవారు.అమ్మా వాళ్ళకి చెపితే నిన్ను బాగా చూసుకుంటున్నాడు కదా మిగిలినవన్ని నీకెందుకు అని అన్నారు.బాగా చూసుకోవడమంటే నాకు అర్దం కాలేదు.తిండి పెట్టి నగలు కొనిచ్చేస్తే బాగా చూసుకోవడం ఎలా అవుతుంది?మనిషికి ఆనందాన్నిచ్చేవి చిన్న చిన్న సరదాలే.వెన్నెల్లో కబుర్లు చెప్పుకోవడం,బీచ్ లో తీరం పొడవునా చెట్టాపట్టాలేసుకుని నడవడం.....ఇవన్ని ఎంత బాగుంటాయి.కాని ఆయన ఇలాంటి వాటికి సమయం లేదంటారు.చాలా పనివుందంటారు.
ఇలా నిట్టూర్పులతో,నిరాశలతో స్పందించే హ్రుదయం లేని మనిషి తో ఆరు నెలలు గడిచి పోయాయి.ఆ రోజు నా పుట్టిన రోజు.ఉదయం అంతా స్నేహితులు,కుటుంబ సభ్యుల సుభాకాంక్షలతో సందడిగా సాగిపోయింది.ఆయన్ని ఆఫీసుకి సెలవు పెట్టంటే ఖాళీగా ఇంట్లో ఏమి చేస్తం సాయంత్రం త్వరగా వస్తాలే అని వెళ్ళిపోయారు.భారం గా సాయత్రం 4అయింది.హడావుడిగా ఆయన వచ్చి త్వరగా బయలుదేరు బయటకి వెళదాం అంటే ఏముంటుంది ఎప్పటిలానే రెస్టారెంటుకో,లేక గిఫ్టు కొనడానికో తీసుకెళుతున్నారనుకున్నా.నాకైతే మాత్రం వెళ్ళాలని లేదు.ఏమి గిఫ్టు కొంటారో అనే ఉత్సాహం కూడా లేదు.అలానే ముభావం గానే బయలుదేరాను.ఎప్పుడూ వెళ్ళని దారి చూస్తూ వుండగానే ఊరి చివరకి వెల్లిపోయాము.ఎమీ అర్దంకాలేదు నాకు.ఎన్నో ఆలోచనలు.ఒక చోట బండి ఆపి వచ్చేసాము దిగు అనెవరకు ఆ అలొచనలు సాగుతూనే వున్నాయి.చూస్తే ఎదురుగా మదర్ అనాధ శరణాలం అన్న అక్షరాలతో బోర్దు కనిపించింది.ఎమిటన్నది కొద్ది కొద్దిగా అర్దం అవుతుందిగానీ పూర్తి గా అలోచించలేకపోతున్నను.అలా రకరకాలు గా అలోచిస్తూనే ఆయన్ని అనుసరిస్తూ లోపలికి వెళ్ళాను.ఒక ముసలావిడ ఈయన్ని చూసి ఎంతో తెలిసిన వ్యక్తిని ,కావలసిన మనిషిని చూసినట్టు నవ్వి లోపలికి తీసుకెల్లింది.వెళ్ళగానే 30,40 మంది పిల్లలు అంకుల్ అంటూ ఆయన్ని చుట్టుముట్టేసారు.అందరినీ ఆప్యాయం గా పలకరించి అపటికే అక్కడ వున్న స్వీట్లు,పళ్ళు నా చేత వాళ్ళకి ఇప్పించారు.అలా ఒక 2 గంటలు గడిచాకా పిల్లలందరికి టా టా చెప్పి ఆఫీసు రూము కి వెళ్ళాము.ఆనందం అంటే ఏమిటో అప్పుడు అర్దమయింది నాకు.ఇందాక చూసిన పెద్దావిడ నన్ను తన దగ్గరగా కూర్చో పెట్టుకుని మాట్లాడింది.అప్పటికి కాని నాకు తెలీలేదు.పెళ్ళవకముందు ఆయన రోజూ సాయంత్రం సమయాల్లో వచ్చి రాత్రి వరకు పిల్లలకు పాటాలు చెప్పి వెలుతూ వుండేవారని,నెల నెలా కొంత మొత్తాన్ని పిల్లల కోసం ఇచ్చే వారని. పెళ్ళి అయ్యాకా కూడా సాయంత్రాలు వస్తుంటే వద్దని చెప్పినా పిల్లల కోసం రావడం మానలేదని .నాకు ఆన్ని అర్దం అవుతున్నాయి ఆయన అలా పొదుపుగా ఎందుకు వుంటున్నారో.కాని నాకు కావలిసినవన్ని ఎందుకు ఇస్తున్నరో మొత్తం గా ఎందుకు పొదుపుచేయట్లేదో అర్దం అవ్వక అడిగాను ఆయన్ని దానికి సమాధానం ఆయన మాటల్లోనే.."నీ వాళ్ళని వదిలి వచ్చేసిన నిన్ను బాగా చూసుకోవడం నా బాద్యత.నువ్వు కోరింది ఇవ్వడం భర్త గ నాకు సంతోషం.నీ సరదాలు తీర్చకుండా ఎవరినో వుద్దరించడం సబబు కాదు.అందుకే నీ సరదాలు తీరుస్తూ నా అవసరాలకు మించి కర్చు చెయకుండా అల పొదుపు చేసిన డబ్బులని ఇలా వుపయోగిస్తున్నాను.మరి వెన్నెల కబుర్లు,తీరం నడకలు అంటావా అది నాకు చాలా విలువయిన సమయం.అవి నీకు సంతోషానివ్వొచు.కాని అదే సమయం ఎందరో పిల్లలకు జీవితాన్నిస్తుంది.నాకు ఈ విషయం లో మాత్రం పిల్లలే ముఖ్యం.అందుకే సాయంత్రాలు నీతో గడపలేక పోయాను." ...ఎప్పుడు నా కన్నులు వర్షించడం మొదలుపెట్టాయో నాకే తెలీదు.ఇప్పటి వరకు ఆయనమీది అభిప్రాయమంతా ఆ కన్నిటి తో కొట్టుకుపోయింది.ఇంకెప్పుడూ అసంత్రుప్తి మా జీవితం లో కి రాలేదు.నేను వెన్నెల్లో తిరగపోయినా,ఖరీదయిన చీరలు,నగలు కొనుక్కోకపోయినా........

నేను సైతం వాళ్ళ భవితకు బాటనేయగలిగాను అనే ఆత్మ సంత్రుప్తి ముందు ఒకప్పటి నా ఊహాలోకం చిన్నదయిపోయింది.స్పందించే హ్రుదయమంటే ఏమిటో బాగా అర్దమయ్యాకా పిల్లల నవ్వుల ముందు వెన్నెల చిన్నబోయింది.

9 Comments:

At 8:36 AM, Blogger spandana said...

రాధి గారూ,
(ఎక్కువగా చెప్పుకోకూడదు గానీ)మీ కథలో నన్ను నేను చూసుకున్నాను.

--ప్రసాద్
http://charasala.com/blog/

 
At 9:24 AM, Blogger రాధిక said...

miilaamti vaallanu neanu nijam gaa cuudabattea ee kadha ikkada raayadam jarigimdi.imduloa ekkuva ceppukoavadam emi leadu.mii laamti vaallani ilaa kalusukoavadam naku caalaa anamdam gaa vumdi.neanu alaa vumdaamanukumtaa kaani vumdaleakapoatunna.

 
At 9:43 AM, Anonymous Anonymous said...

చాలా బాగుంది.


విహారి
http://vihaari.blogspot.com

 
At 11:26 PM, Blogger శ్రీనివాసరాజు said...

చాలా బాగుంది.. మాటల్లో చెప్పలేనంత.. ఆనందంగా ఉంది.. అటువంటి వ్యక్తిని కలవాలని కూడా ఉంది.. అందరికోసం ఆలోచించేవాళ్ళు చాలా తక్కువమందే ఉంటారు..

 
At 11:44 PM, Blogger శ్రీనివాస said...

చాలా బాగుంది. మీరు చాలా అదృష్టవంతులు :)

 
At 9:25 AM, Blogger రాధిక said...

This comment has been removed by the author.

 
At 5:52 PM, Blogger రాధిక said...

ఇది నా జీవిత కధ కాదండి.ఒకాయన్ని చూసాకా రాయాలనిపించి రాసాను.అయినా ఇలాంటి కధాంశం తోనే ఈనాడులో ఒక కధ కూడా వచ్చింది.అది కూడా నాకు,ఈ కధకు ప్రేరణ.

 
At 10:21 PM, Blogger ఆసా said...

కధ అయినా వాస్తవానికి దూరంగా అయితే లేదు.
నాకు తెలిసి ఇలాంటి భావాలు వున్నవాళ్ళు చాలామంది వున్న, కారణాలు ఏమైనా ఆచరణలో పెట్టేవాళ్ళు మాత్రం తక్కువే అని చెప్పవచ్చు.

మీ కధానిక ప్రవాహం బావుంది. అయినా మీ కవితా కలంకి పదాలు కూర్చటం పెద్ద పనేమి కాదనుకొంటాను.

 
At 12:14 AM, Blogger Boyina Jyothi Ravi kumar Yadav said...

hi radhika garu
how r u
mee feelings naku chala baga nachayee. oka sari na life guda guruthuki vachindi
meeru tesukunna decision kuda bhagundi

 

Post a Comment

<< Home