సిరివెన్నెల
సిరివెన్నెల..ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.ఎందుకంటే ఈయన గురించి తెలీని తెలుగువాడు వుండడుకదా.నాకు ఈయన పాటలంటే అమితమైన అభిమానం.వ్యక్తి గా కూడా అయన్ని నేను చాలా అభిమానిస్తాను.నాకు ఒక పెద్ద కోరిక తీరకుండా అలానే వుండిపోతుంది.ఎప్పటికయినా సిరివెన్నెల గార్కి ఒక పెన్ [కలము]బహూకరించాలన్నదే నా తీరని కోరిక.ఎప్పటికి ఆయన్ని కలుస్తానో ఏమిటో?సిరివెన్నెల గారి ఒక పాట ఇప్పటివరకు ఏ సినిమాలోను రాలేదు.నాకు చాలా ఇష్టమైన ఈ పాట మీ కోసం ఇక్కడ ఇస్తున్నాను.సిరివెన్నెల గారి గొంతులోనే వినండి.
http://www.siliconandhra.org/siri/eppuh.rm
8 Comments:
Wow !! Thx andi.
great song. Thank you.
--Prasad
http://blog.charasala.com
Wonderful song.
బాగుందండి. నాకూ మీలాగే ఓ చిన్ని కోరిక ఉందండి. నేనయితే సిరివెన్నెలగారి పాత కలం ఏదైనా అడిగి తీసుకుందామనుకుంటున్నాను. నాకు ఆయనంటే ఎంత అభిమానమంటే నేను వికీపీడియాలో నా తొలి వ్యాసం ఆయనదే.
http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B5%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%86%E0%B0%B2_%E0%B0%B8%E0%B1%80%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF
మీరు మెరుగులు దిద్దుతారని ఆశిస్తున్నాను.
శ్రీనివాస గారు నేను గాని సిరివెన్నెల గారిని కలిస్తె మీ కోసం పెన్ అడిగి తీసుకుంటాలెండి.మీరు గాని కలిస్తె నాకొసం ఆయన సంతకం తీసుకొండి.డీల్ ఓకే ?
థ్యాంక్స్ రాధిక గారూ. డీల్ ఓకే :)
చాలా సందేశాత్మకమైన పాట, సందేహమేలేదు. మన సంకల్పం గట్టిగా ఉంటే నిరాశకే నిరాశ పుట్టడం ఖాయం. ఈ పాట విన్నారు కాబట్టి, మీరు కూడా పెన్ను ఇచ్చే విషయంలో 'ఓటమి' ఒప్పుకోకండి. ఆ ఇచ్చే సందర్భంలో నేను కూడా ఒక అభిమానినని ఆయనకి చెప్పండి, ఆ టైములో మీరు మీరుగా ఉంటే.
Chala manchi song andi.. thanks for sharing it..
Nenu kuda Sirivennela garini kalavalani eppatinundo anukutunnanu.. monna ma fried okadu naaku phone chesadu ,hyd lo kaludammani. (aa time lo Sirivennela valla intlo nundi phone chesadata,vedhava) chance miss ayyanu.
Naaku kalise chance vaste, meeku kuda cheptanu lendi
Post a Comment
<< Home